

గరుడ ( న్యూస్ ) స్థానిక పుంగునురు పట్టణం లోని నారాయణ స్కూల్ లో వేలాది రూపాయిలు వసూలు చేస్తూ ప్రభుత్వ నిభందనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్ లు చేసుకుని ఎండ వేడిని కూడ లెక్క చేయకుండా క్లాస్ నిర్వహిస్తు నిబంధనల కు వ్యతిరేకంగా నడుపుతున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్న కోరారు.స్థానిక పుంగనూరు పట్టణంలోని నారాయణ స్కూల్ లో వేలకు వేల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూళ్లు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ముందస్తు అడ్మిషన్లు చేస్తూ పాఠశాలలు పునః ప్రారంభం కాకముందు నుండే ఎండ తీవ్రతను లెక్కచేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ తరగతులు నిర్వహిస్తున్నారు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి నారాయణ స్కూల్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు .ముందస్తు అడ్మిషన్లు చేస్తూ క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ స్కూల్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ స్కూల్స్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని ఆయన పేర్కొన్నారు.