అట్రాసిటీ కేసుల్లో పరిహారం ఏది?

G Venkatesh
2 Min Read

గరుడ( న్యూస్ )ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కేసులకు సంబంధించి ఫిర్యాదు దారులు కోర్టులకు హాజరయ్యేందుకు, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వపరంగా పరిహారం అందజేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989కు కేంద్ర ప్రభుత్వం 2016లో మరింత బలోపేతం చేసింది. ఈ చట్టం ప్రకారం బాధితులకు ప్రభుత్వపరంగా మూడు విడుతల్లో రూ. లక్ష నుండి రెండు లక్షల వరకు పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా కింద బాధితునికి అందజేయాలి. అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదైన వెంటనే రూ.25 శాతం, పోలీసులు కోర్టుల్లో చార్జ్‌షీట్‌ వేయగానే 50 శాతం, శిక్ష ఖరారైన తరువాత మరో 25 శాతం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తరువాత 25 శాతం పరిహారం అందుతున్నప్పటికీ ఆ తరువాత చెల్లించాల్సిన వాయి దాలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. మరికొన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా పరిహారం చెల్లించడం లేదని తెలుస్తోంది. అట్రాసిటీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పెండింగ్‌లో ఉంటున్నట్లు సమాచారం.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పరిహారం చెల్లించేందుకు జిల్లా పరిధిలో కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీస్‌ కమిష నర్‌, తదితరులు మెంబర్లుగా ఉంటారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే నగదును కలెక్టర్‌ ద్వారా నేరుగా బాధితుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాల్సి ఉంటుంది. జిల్లాకు సంబంధించి 2022 నుంచి నమోదైన కేసుల్లో చాలా వాటికి ఇప్పటి వరకు పరిహారం చెల్లించలలేదు.

అట్రాసిటి చట్టం ప్రకారం మూడు విడుతల్లో పూర్తి సొమ్ము చెల్లిం చాల్సి ఉండగా అనేక కేసుల్లో ఒక్క విడుతతోనే నిలిపివేసినట్లు తెలు స్తోంది. కోర్టుల్లో హియరింగ్‌ దశలో ఉన్న కేసుల్లో సైతం 25 శాతం వరకే చెల్లింపులు జరగడం గమనార్హం. పరిహారం చెల్లించడంలేదు.ఉదాహరణ కు చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, చాలాకాలం గ్రామంలో ఉత్తరాది హరిప్రసాద్ అనే వ్యక్తి పై అర్థరాత్రి డేవిడ్ చంద్రకుమార్,ఇంమ్రాన్ అనే ఇద్దరు చంపుతామని బెదిరించారని,11/06/2022 ను రఫ్.ఐ.ఆర్ ఐనది.మొదటి విడుతగా 30/11/2022 ను చెల్లించాలని చెబుతున్నారు, ఐతే సదరు అట్రాసిటీ కేసు కోర్టుకు 12/01/2023 ను 04/2023 గా నమోదు కాబడిన ది.ఐతే సదరు కేసుకు సంబంధించిన రెండవ విడత పరిహారం నేటికీ చెల్లించలేదంటే అధికారులకు సదరు కేసుల విషయం లో ఎంతటి నిబద్దత ఉందో ఇట్టే అర్థమౌతుంది.కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అట్రాసిటీ కేసుల్లో పరిహారం వెంటనే చెల్లించాలని బాదితుడు ఉత్తరాది హరిప్రసాద్ కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *