

గరుడ ( న్యూస్ )బక్రీదు పండగను మతసామరస్యానికి ప్రతీకగా కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని,ఈ సందర్భంగా యస్సై నాగేశ్వర్ రావు ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.బక్రీద్ మండల వ్యాప్తంగా జరుపుకోవాలని ,వివిధ ప్రాంతాల్లోని మసీదుల వద్దకు బక్రీదు పండగ సందర్భంగా ముస్లిం సోదరులు సందర్శించి, ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టే అవకాశం ఉన్నందున మసీదుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, ముఖ్యమైన మసీదుల వద్ద,పోలీసు స్టేషను పరిధిలోని మసీదులను కవర్ చేస్తూ పెట్రోలింగు నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపడుతున్నట్లు పీస్ కమిటీ సభ్యుల కు తెలియజేశారు. ప్రజలకు, ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగు చేసుకోవాలన్నారు. మతసామరస్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ముస్లింలు-హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే సమాచారాన్ని డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు అందించాలనిప్రజలకు యస్సై నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండలం లోని ముస్లిం సోదరులు,హిందూ సోదరులు పాల్గొన్నారు.


