సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మహమ్మదాబాద్,జూన్7,(గరుడ న్యూస్):
మహ్మదాబాద్ గ్రామపంచాయతీ లో బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేసి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లబోతు సురేష్ యాదవ్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు,క్రీడాస్థలం,ఉదయం జావా మధ్యాహ్న భోజనం,మరియు శుభ్రమైన నీరు టాయిలెట్లు మొదలగునవి ఉంటాయని తెలియజేశారు.ప్రభుత్వ పాఠశాలలో ఎంతో ప్రతిభగల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉంటారని వారు పిల్లలకు సరైన విద్యాభ్యాసాలు అందిస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.తదనంతరం ఇంటింటికి వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు చేర్పించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కడగంచి అమరేందర్,టీచర్ రవికాంత్, అంగన్వాడీ టీచర్ మరియు గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది.




