
గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద గల బసవరాజ బాలికల జూనియర్ కళాశాల ప్రహారీ గోడ శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. చరిత్రలో ఈ కళాశాలకు ఓ ప్రత్యేకథ ఉంది. ఈ ప్రహారీగోడ పురాతన కాలంలో నిర్మించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు తడవడంతో ఈ ప్రహారీ ఒక్కసారిగా కుప్పకూలినట్లు ప్రజలు భావిస్తున్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కళాశాల ప్రహారీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
