
సుమారు 2 వేల మంది తో కార్యక్రమ నిర్వహణ
గరుడ న్యూస్ జూన్ 09 సోమవారం చౌడేపల్లి మండలం బోయకొండ దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా పర్యటకశాఖ అధికారిని ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణ పై వివిధ శాఖల అధికారులు ఆయుష్ నోడల్ అధికారులు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు తో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతాలలో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఇదివరకే కాణిపాకం, పులిగుండు నందు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, జూన్ 09 సోమవారం చౌడేపల్లి మండలం బోయకొండ దేవస్థానం వద్ద ఉ.7 గం.ల నుండి ఉ.8 గం.ల వరకు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలనన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లో భాగస్వాములై విజయ వంతం చేయాలన్నారు.
