
గరుడ న్యూస్ పుంగనూరు మండలంలోని విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సైనింగ్ స్టార్ అవార్డుల ప్రకటన విడుదల కావడం విశ్వయం కలిగిస్తున్నది. ప్రభుత్వ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టాలి కానీ అన్ని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు రివార్డులు ఇవ్వడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో వచ్చిన విద్యార్థుల మార్కులకు సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులను ఎంపిక చేయకుండా ప్రైవేట్ విద్యార్థులను ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలను మోసం చేయడం జరుగుతున్నదని తెలియజేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఓపెన్ క్యాటగిరిలో ఒకే రకమైన మార్కులు వచ్చిన అదే మార్కులు ప్రభుత్వ పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులకు వచ్చిన ఎంపిక చేయడం లేదని ఇది దేనికి సంకేతమని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రకటనలు తప్ప ఇలాంటి కార్యక్రమాలను చూస్తే ప్రభుత్వ విద్యను విద్యార్థులను మోసం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతున్నది. మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ విద్యార్థులను ఎంపిక చేయాలి కానీ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఎంపిక చేసి ఎవరికి లబ్ది చేకూరాలని పలువురు విచారo వ్యక్తం చేశారు. పుంగనూరు మండలంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిని కూడా జిల్లా స్థాయి కార్యక్రమాలు ఎంపిక చేయకుండా ఎవరి మేలు కొరకు నిర్వహిస్తున్నారు అధికారులకే తెలియాలి. అర్హత ఉన్న ప్రభుత్వ విద్యార్థులు మండలంలో ఉన్నాను ప్రైవేట్ విద్యార్థుల ఎంపిక ఎలా జరిగిందని దీని వెనక గల కారణాలు ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలల్లో OC కి 589 వచ్చిన ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు 589 బీసీ విద్యార్థిని ఎందుకు ఎంపిక చేయడం లేదని, ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ విద్యార్థులకు ఏ సందేశం పంపాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు మేలుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ విషయమై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని తెలియజేశారు.
