
గరుడ న్యూస్.

లేచిపోయిన మహిళ పంచాయతీలో తలదూర్చిన పెద్ద మనిషిపై దాడి..
-ఎదురు దాడిలో ప్రత్యర్థులకు సైతం గాయాలు..
-ఒక వర్గంలో ఏడుగురు.. మరో వర్గంలో ముగ్గురికి తీవ్ర గాయాలు..
-బాధితులను మదనపల్లె, పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు…
-వైసిపి × టిడిపి మధ్య ఘర్షణ జరగడంతో రెండు గ్రామాలలో నెలకొన్న ఉద్రిక్తత..
అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజక వర్గం,రామసముద్రం మండలంలో రెండు గ్రామాల మధ్య శనివారం రాత్రి వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. లేచిపోయిన ఓ అమ్మాయి పంచాయతీలో తలదూర్చిన పెద్ద మనిషి ఎర్ర బోయినపల్లికి చెందిన గంగప్ప, శ్రీరాములపల్లికి చెందిన వెంకటప్ప ల విషయమై గత పది రోజులుగా రెండు గ్రామాలకు చెందిన వారు గొడవ పడుతున్నారు. ఈ విషయమై ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ శనివారం సాయంత్రం రెండు వర్గాలను పోలీస్ స్టేషనకు పిలపించి రాజీ కుదుర్చి గొడవపడకూడదని సర్థి చెప్పి స్టేట్ మెంట్ తీసుకుని పంపేసాడు. ఎర్రబోయినపల్లికి వెళుతున్న గంగప్ప వర్గీయులపై శ్రీరాముల పల్లెలో వెంకటప్ప వర్గీయులు దారికాసి కొట్టి ఘర్షణకు దిగారు. గొడవ తార స్థాయికి చేరి ఇరువర్గాలు కర్రలు, కొడవళ్ళతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో కమ్మవారిపల్లి పంచాయతీ ఎర్రబోయినపల్లికి చెందిన టిడిపి మాజీ సర్పంచ్ కె చిన్నవెంకటప్ప67, కే. వెంకటరమణ45, యశ్వంత్25, సుధాకర్35, గంగాధర్40, కే. గంగాధర్ 30, విశ్వనాధ్ లు గాయపడగా ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆర్నడింపల్లి పంచాయతీ, శ్రీరాముల పల్లెకు చెందిన వైసిపి నేత వెంకటప్ప, అతని అనుచరులు మరో ఇద్దరు గాయపడ్డ వారిలో ఉన్నట్లు తెలిసింది. చెత్త గాత్రులను చికిత్స కోసం మదనపల్లె పుంగునూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లి నుంచి బెంగళూరుకి చిన్న వెంకటప్ప, వెంకటరమణ, యశ్వంత్ లను తరలించగా తక్కిన వారు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రెండు గ్రామాలకు చెందిన వైసిపి × టీడీపీ వర్గాల మధ్య పరస్పర దాడులు చేసుకుని కొట్టు కోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామసముద్రం ఎస్సై రవికుమార్ సిబ్బందితో వెంటనే మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఘటన గల కారణాలను ఆసుపత్రిలో ఉన్న బాదితులను అడిగితెలుసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.