
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ క్షేత్రం మైన బోయకొండపై ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలవులు ముగియడానికి దగ్గరపడటంతో రాష్ట్రంతో పాటు,కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇతర ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు కొండకు తరలివచ్చారు దీంతో ఎక్కడ చూసినా భక్త జన సందోహం నెలకొని ఉంది ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి క్యూ లైన్ లన్నీ భక్తులతో కిటకిటలాడాయి కొండ దినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో గంగమ్మకు విశేషాలు అభిషేకము అలంకరణ గావించారు ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం క్యూలైన్లలో పెద్ద భోగం చిన్న భోగం వద్ద కొండ కింద యాత్రికుల వసతి సౌకర్యాలను సమకూర్చారు ఆలయ అర్చకులు, ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు.
