సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం మండల,జూన్09,(గరుడ న్యూస్):
తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కి మంత్రి పదవి ఇవ్వకుండా నిరాశపరచడం కాంగ్రెస్ శ్రేణులు మునుగోడు ప్రజలు రైతాంగము జీర్ణించుకోలేకపోతున్నాదని మునుగోడు ప్రజల చిరకాల కోరిక ఈ ప్రాంతానికి మంత్రి ఉండాలని ఈ ప్రాంతం సాగు జలాలు రావాలని వైద్యము విద్య రంగము పరిశ్రమలు, రోడ్లు,అభివృద్ధి చెందాలంటే తరతరాల నుంచి వెనుకబడిన ఈ మునుగోడు ప్రాంతానికి మంత్రి ఉండవలసిందే అలాంటప్పుడే ఈ ప్రాంత ప్రజల రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతావని పట్టుదల కృషి అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సాధించిన మహానేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం దురదృష్టకరమని ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం గమనించలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ఎన్నికలలో ఈ ప్రాంతాన్ని అణు అణువునా చూశారని కరువు పీడిత ప్రాంతమైన ఈ మునుగోడు అభివృద్ధి జరగాలంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,తోటి సాధ్యమవుతున్నదని అభివృద్ధి చేయాలనే తపన పట్టుదల గల నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే అని ఈ ప్రజల సంకల్పాన్ని నెరవేర్చిన వారు అవుతారని తరతరాల నుండి వెనుకబాటుతనము కరువు పీడిత ప్రాంతం రైతాంగ ఉద్యోగ పరంగా విద్యాపరంగా,అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే అధిష్టానము గమనించి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మంత్రి పదవి ఇవ్వాలని యాదాద్రి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ అధిష్టానానికి,ముఖ్యమంత్రివర్యులు బహిరంగ లేఖ రాయడం జరిగింది.