
గరుడ న్యూస్ వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు అక్కిసాని విజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ, జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప కలసి విజయ్‌కుమార్‌రెడ్డి స్వగ్రామమైన గెరిగపల్లెకి చేరుకుని ఆయన భౌతికకాయానికి ఘననివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, అక్కిసాని రాజారెడ్డిలను పెద్దిరెడ్డి పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కొండేటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
