గరుడ న్యూస్ యోగ్యాధ్రతోనే ఆరోగ్యాంధ్ర సాధ్యమౌతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు యోగా ప్రాధాన్యత, యోగా వలన కగే ప్రయోజనాల గురించి వివరించారు. పట్టణంలో మానవహారం చేపట్టామన్నారు. ఈయోగాను నిత్యం ప్రతి ఒక్కరు 30 నిమిషాల పాటు నిర్వహిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం స్థానిక మున్సిపాలటి కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



