

తిరుచానూరు, గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: బదిలీపై వెళ్తున్న తిరుచానూరు ఆలయ ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ ని సత్కరించిన ఇతర ఆలయ ఏవీఎస్ఓలు విఐలు అమ్మవారి అర్చకులు సుదీర్ఘకాలం అమ్మవారి ఆలయంలో పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ ని సోమవారం ఉదయం తోలప్ప గార్డెన్ విజిలెన్స్ ఆఫీసులోని ఆయనని ఘనంగా సన్మానించినారు. పద్మావతి అమ్మవారి ఆలయ ఇంచార్జ్ ఏవీఎస్ఓ శైలేంద్రబాబు మాట్లాడుతూ సతీష్ కుమార్ తిరుమల తిరుచానూరు వివిధ ఆలయాల్లో భక్తులతో సిబ్బందితో ఇటువంటి ఇబ్బందులు కలగచేయకుండా ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. ఆయన సుదీర్ఘకాలం అమ్మవారి ఆలయంలో పనిచేస్తూ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోజు కి 15000 మంది భక్తులకి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఏ జిల్లాలో అయినా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాక్షించారు ఆలయ అర్చకులు బాబు స్వామి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపైనసతీష్ కుమార్ ఎక్కడ పని చేసిన ఇలాగే క్రమశిక్షణతో పని చేస్తారని కొనియాడారు. మల్ల తిరిగి సతీష్ కుమార్ అమ్మవారి ఆలయానికి వి జీవోగా రావాలని ఆశిస్తున్నట్లు బాబు స్వామి తెలిపారు. అనంతరం ఇంచార్జ్ ఏవీఎస్ఓ సైలంద్రబాబు బాబు స్వామి ఇతర అర్చకులు సతీష్ కుమార్ నీ పూలమాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆలయ ఇంచార్జ్ ఏవీఎస్ సైలేంద్రబాబు ఇతర ఏవీఎస్ లు రమేష్ కృష్ణ రాజశేఖర్ శివ ఇతర వీఐలు మోహన్ రెడ్డి రమణారెడ్డి రమణ మరియు విజిలెన్స్ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

బదిలీపై వెళ్తున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కి వీడ్కోలు సన్మానం



