
గరుడ న్యూస్ పుంగనూరు మార్కెట్లో రోజురోజుకు టమాట ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం మార్కెట్లో కనిష్టంగా 10 కిలోల బాక్స్ ధర రు. 227 వరకు పలకగా, కనిష్టంగా రు.200 ధర లభించింది. మార్కెట్కు 952.09 మెట్రిక్ టన్నులో పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో పలుచోట్ల టమాట పంట దెబ్బతినడంతో రేటు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
