
గరుడ న్యూస్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ డివిజనల్ పరిపాలన అధికారిగా బుధవారం కె.నిర్మలా దేవి బాధ్యతలు స్వీకరించారు. రామసముద్రం మండలం తహసీల్దార్ గా పని చేస్తున్న నిర్మలా దేవిని సాధారణ బదిలీలలో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వుల మేరకు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో గా బాధ్యతలు స్వీక రించారు. ఏవో బాధ్యతల అనంతరం సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ ను ఏవో నిర్మల దేవి కలిసి పూల బొకేను అంద జేశారు.
