

గరుడ న్యూస్ చౌడేపల్లి మండలం గోసుల కురుపల్లెకు చెందిన కుమార్.అంకాలమ్మ కొండ కింద షెడ్డు ఏర్పాటు చేసుకొని ఆవులను పెంచుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి షెడ్డులో గల దూడను చిరుత పులి దాడి చేసి చంపేసింది. చిరుత పులి దాడి జరిగిందన్న విషయం తెలియడంతో స్థానిక ప్రజలతో పాటు రైతులు బెంబేలెత్తిపోతున్నారు అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.