గరుడ న్యూస్ పుంగనూరు మండలంలోని మార్లపల్లెలో గల ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలంలోని మార్లపల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1, 2 తరగతులు మాత్రమే అర్హత కల్పించి, పక్కగ్రామమైన సింగిరిగుంట ప్రభుత్వ పాఠశాలలో 3,4,5 తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు సింగిరిగుంట పాఠశాలకు వెళ్లే మార్గంలో హంద్రీనీవా కాలువ , హైవే రోడ్డు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను మార్లపల్లె పాఠశాలలోనే చదువుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.



