
తిరుపతి జిల్లా, తిరుచానూరు స్వర్ణముఖి సమీపంలోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయం కూల్చివేతలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక వైసిపి ఇలాంటి దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆరోపించారు. గురువారం తిరుచానూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారాహి అమ్మవారి ఆలయం ఉన్న భూమి తమ బంధువులదేనని, ఎవరో ఆలయాన్ని ధ్వంసం చేస్తే కొందరు నా పైనా, మా ఎమ్యెల్యే నాని పైనా దుష్ప్రచారానికి పాల్పడడం దారుణమన్నారు. ఆలయం కూల్చివేతలో తమ పాత్ర ఉందని అవస్తావాలు ప్రచురించిన ఓ పత్రిక పై పరువు నష్టం దావా వేస్తామన్నారు.
వారాహి అమ్మవారి ఆలయం నిర్మించిన స్వామిజీ పెద్ద దొంగ స్వామిజీ అని ఆరోపించారు. ఆ స్వామిజీ ఆలయం పేరుతో రైతుల భూములు కబ్జా చేయాలని చూస్తున్నాడని అన్నారు. అతను ప్రతి నిత్యం మద్యం, గంజాయి సేవిస్తూ ఆ ప్రాంగణంలోనే క్షుద్ర పూజలు చేసేవాడన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే తనపై తప్పుడు రాతలు ప్రచురించారని అన్నారు.


టిడిపి తిరుచానూరు అధ్యక్షులు కిషోర్ రెడ్డి ప్రెస్ మీట్



