
తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): తిరుచానూరు స్వర్ణముఖి నది సమీపంలోని శ్రీ ఆదివారాహి ఆలయాన్ని కూల్చి వేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం స్థానిక నాయకులతో కలిసి నేలమట్టం చేసిన అమ్మవారి ఆలయాన్ని మురుగునీటిలో కూలదోసిన విగ్రహాలని విగ్రహాలను పరిశీలించారు. అనంతరం హర్షిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు రక్షణ కరువైందని అమ్మవారి విగ్రహాన్ని కాళ్లు చేతులను నరకడమే సనాతన ధర్మమా ? వారాహి అమ్మవారి భక్తుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఇంతటి దారుణానికి కారణం ఇసుక, మట్టి మాఫియా బరితెగింపే.. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని అండతోనే తిరుచానూరు టిడిపి నాయకులు రెచ్చిపోతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వేలాదిమంది భక్తులు పూజలు చేసుకుంటూ ఉన్న ఆలయాన్ని కేవలం ఇసుక, మట్టి అక్రమ రవాణాకు అడ్డుగా ఉందని ఇంతటి దారుణానికి ఒడిగట్టునట్లుగా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆలయాన్ని నేలమట్టం చేసిన స్థానిక టిడిపి నాయకుల్ని ఇప్పటివరకు అరెస్టు చేయలేదంటూ దాని వెనక కూటమి నాయకులు లేదంటారా అని ప్రశ్నించారు. ఇంతటి అరాచకానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరు అమ్మవారి అగ్రహానికి గురిగాక తప్పదు అన్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై త్రీవ అగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రామచంద్రా రెడ్డి, సూరి, ఎంపీటీసీలు నరేష్ రెడ్డి, యోగానంద రెడ్డి, వార్డ్ నెంబర్లు మునేంద్ర, డిష్ చంద్ర స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, ఆర్ఆర్ యూత్ తదితరులు పాల్గొన్నారు.





