
గరుడ న్యూస్ పుంగనూరు లయన్స్ క్లబ్ ఆఫ్ నోబుల్ వారి ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో పదవ తరగతి నందు ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థినులకు దాదాపుగా 30 మందికి సర్టిఫికెట్స్,మెడల్స్, పెన్నులు చాక్లెట్స్ ను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుద్రాణి, లయన్స్ క్లబ్ ప్రతినిధుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు త్రిమూర్తిరెడ్డి, అమరావతి సురేష్,కెర్లపల్లి బాలసుబ్రమణ్యం, ఇనాయతుల షరీఫ్,కేశవరెడ్డి, రఘుపతి రెడ్డి,లయన్స్ క్లబ్ మీడియా చైర్మన్ సతీష్ కుమార్ రాజు,మల్లికార్జున రాయల్,రామ్ కుమార్, కృష్ణమూర్తి,రాజేంద్ర,గంగుల చారి మంజునాథ్, మీడియా ప్రతినిధులు కార్తీక్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు, హెల్పింగ్ లయన్స్ సభ్యులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు
