కన్నుల పండుగల విజయ వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం

Ashok kumar
1 Min Read



గరుడ ప్రతి నిధి
చౌడేపల్లి జూన్ 13

విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు మండలంలోని ఆమెని గుంట పంచాయతీ సింగిరిగుంటలో గల విజయ వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు ఉదయాన్నే భక్తుల సమక్షంలో ప్రధాన కలశ స్థాపన పంచ కలిసస్థాపన పుణ్య వహచనము వాస్తు పూజ నవగ్రహారాధన అష్టదిక్పాలక పూజ ప్రధాన మహాగణపతి హోమం నవగ్రహ హోమం శాంతి హోమం మహా పూర్ణాహుతి కావించారు మధ్యాహ్నం నుంచి అభిజిత్ లగ్నం నందు సిద్ది బుద్ధి సమేత విజయ వినాయక స్వామి వారికి కల్యాణోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు అనంతరం మహా మంగళహారతి పంచహారతము తీర్థప్రసాద వినియోగం జరిగింది సాయంత్రం సిద్ధిబుద్ధి సమేత విజయ వినాయక స్వామి వారిని అత్యంత వైభవంగా అలంకరించి పుష్ప పల్లకిలో సింగిరిగుంట గ్రామం నందు ఊరేగించారు నిర్వాహకులు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్వామివారి పవిత్ర తీర్థ ప్రసాదాలు అందించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *