
గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని శ్రీశనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పట్టణ సమీపంలోని యాబైరాళ్ల వెహోరవ వద్ద వెలసిన శ్రీశనేశ్వరస్వామి ఆలయం, అలాగే రాగానిపల్లె రోడ్డులో వెలసిన శ్రీశనేశ్వరస్వామి, దండుపాళెంలోని శ్రీశ్రీశనేశ్వరస్వామి ఆలయంలోను ప్రత్యేక తైలాభిషేకము, నువ్వులు, నూనేతో, అమృతాభిషేకాలు, నువ్వుల దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
