గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 14
చౌడేపల్లి మండలంలోని 4 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని మండల వైద్యాధికారి పవన్ కుమార్ తెలిపారు స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని ఏ కొత్తకోట పెద్ద కొండా మరి 29ఎ చింతమాకులపల్లి దిగువపల్లి లలో పనిచేయుటకు ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు స్థానిక కోడలు అయి ఉండాలని పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ ఆపై చదువుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు వితంతువులు ఒంటరి మహిళలు దరఖాస్తు అన్నారు స్వచ్ఛంద సంస్థలలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు తెలుగు రాయగలిగే స్వచ్ఛంగా మాట్లాడగలిగి ఉండాలన్నారు 25 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారి ఉండాలని మేరకు ఎమ్మార్వో జారీ చేసిన స్థానిక నివాస పత్రం ఆధార కార్డు రేషన్ కార్డు బ్యాంకు పాస్ బుక్కు ఓటర్ కార్డు జత పరచాలన్నారు ఐదేళ్ల లోపు పిల్లలుంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వైవాహిక స్థితి సర్టిఫికెట్ నాలుగు కలర్ ఫోటోలు దరఖాస్తుకు జతపరచాలన్నారు మరిన్ని వివరాలు దరఖాస్తు ఫారంలో ఉంటారన్నారు సచివాలయ విలేజ్ క్లినిక్ ల వద్ద పొందవచ్చును అన్నారు విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ ద్వారా అప్లికేషన్ల పరిశీలన ఉంటుందన్నారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 17 లోపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి పని దినాలలో సమర్పించాలన్నారు