గరుడ న్యూస్,సాలూరు
చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద ఇద్దరు ఉంటే 26 వేలు ముగ్గురు ఉంటే 39వేలు నలుగురు ఉంటే 52 వేలు, ఒక్కరు ఐతే 13 వేలు చొప్పున తల్లుల ఖాతా లో జమా అయ్యాయని,2 వేలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలో డబ్బులు జామా అయ్యాయని,వైసీపీ ప్రభుత్వం హయం లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 42 లక్షల మందికి అందిస్తే,కూటమి ప్రభుత్వం హయం లో 67 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నామని పేర్కొన్నారు.అర్హులందరికీ అందిస్తున్నట్టు తెలిపారు.”డొక్కా సీతమ్మ బోజన పథకం” లో సన్న బియ్యం తో పాఠశాలలను తెరిచిన రోజు నుండి సన్న బియ్యం తో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు.బదులు మొదలైన రోజున డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కొత్త యూనిఫాం, బూట్లు తో కిట్లను అందించామని అన్నారు.గతం లోలాగా దిష్టి బొమ్మల లాగా ఫోటోలు ,పేర్లు ఎక్కడా ఉండవు..కేవలం రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది ఎందుకంటే అది ప్రజల ఆస్తి అన్నారు.గుంతలు లేని రోడ్లు,గృహిణులకు 3 ఉచిత సిలిండర్లు,4 వేల పెన్షన్ల తో అవ్వా,తాతల బోసి నవ్వులు, ఉత్సాహం తో ఊపందుకున్న రాజధాని నిర్మాణాలు,రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు,ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు అన్నారు.5 ఏళ్ల నిర్వేదం నుండి నూతన శకం ప్రారంభం అయిందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి తెలిపారు.




