
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు టౌన్ పరిధిలో డబ్బీ వీధి సెంటర్ , మామిడిపల్లి రోడ్ లో 24 వ వార్డ్ వాస్తవ్యులు , మున్సిపల్ కౌన్సిలర్ ప్రతినిధి భవిరెడ్డి సత్యప్రసాద్ , డా.భవిరెడ్డి డేవిడ్ శ్యామ్యూల్ రాజు ప్రేమ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక లో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేసి,వారి కుటుంబ సభ్యులు తో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రజలకు మంచి వైద్యం అందించి, ప్రతి దినం వైద్యం కోసం వచ్చే వారికి అందుబాటులో ఉండాలని వారికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సాలూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ లు,ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని హాస్పిటల్ ప్రారంభోత్సవం నీ విజయవంతం చేశారు.

