

తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్తరాషాడ నక్షత్రము సందర్భంగా సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు శనివారం సాయంత్రం ఏడు గంటలకి గజవాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగితు భక్తులను కనువిందు చేశారు. అడు అడుగున భక్తులు అమ్మవారికి కర్పూర నీరజానాలు సమర్పించినారు. ఇందులో భాగంగా అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు అభిషేకం నిర్వహించినారు. అనంతరం సాయంత్రం అమ్మవారి సర్వంగ సుందరంగా అలంకరించి అనంతం అమ్మవారు గోవింద నామ స్మరణాల నడుమ గజవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఆలయ ఇంచార్జ్ సూపర్డెంట్ ప్రసాద్, వాహనం ఇన్స్పెక్టర్ సుభాష్కర నాయుడు, చలపతి, విఐ రాము, అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.


