
విద్యా ఉపయోగకర వస్తువులు పంపిణీ
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 16
మండలంలోని పలు పాఠశాలల్లో దాతలు విద్యా ఉపయోగకర వస్తువులను విద్యార్థులకు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ రాజు (పతి రాజు) దాతృత్వంతో శెట్టిపేట పదేళ్లపల్లి యువజనుల ఆధ్వర్యంలో రెండు పంచాయతీలలోను గల పాఠశాలల్లో గల విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు శెట్టిపేట మేకల చిన్న పల్లి పందిళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలలతో పాటు మేకల చిన్న పల్లి ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు దాదాపు రూ 2 లక్షల విలువచేసే నోటు పుస్తకాలు స్టడీ మెటీరియల్ పెన్నులు పెన్సిళ్లు వంటి విద్య ఉపయోగకర వస్తువులు పంపిణీ చేశారు అదేవిధంగా శెట్టిపేట పాఠశాలలో గ్రౌండ్ ఫ్లోర్ మ్యాట్ మేకల చిన్న పల్లి అంగన్వాడి కేంద్రానికి స్మార్ట్ టీవీ వంటివి బహూకరించారు ఈ కార్యక్రమంలో యువజన నాయకులు సాగిరాజు ప్రదీప్ రాజు వెంకటరమణ సుధాకర్ ప్రవీణ్ కుమార్ రాఘవేంద్ర రాజు కుమార్ సుబ్రహ్మణ్యం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు
