
గరుడ న్యూస్ రామసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్ గా నరేంద్రబాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నాగరాజు సాధారణ బదిలీల్లో భాగంగా తంబళ్లపల్లి సర్వేయర్ గా బదిలీపై వెళ్లారు. అక్కడ పనిచేసిన నరేంద్రబాబు ఇక్కడికి వచ్చారు. మండలంలో భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని నరేంద్ర బాబు తెలిపారు.
