
గరుడ న్యూస్ చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు కమీషనరు,దేవదాయ శాఖ,విజయవాడ రామచంద్ర మోహన్ విచ్చేసినారు. దేవస్థానము నందు శానిటేషన్, క్యూ లైన్లు, ప్రసాదములు మొదలగు వాటిపై మరియు భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనము సులువుగా జరిగినట్లు విలువైన సలహాలు మరియు సూచనలు జారీ చేసియున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం దేవస్థానము నందు పలు అభివృద్ధి పనులను చేయవలసినదిగా ఆదేశించియున్నారు. ఈ కార్యక్రమములో దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి జే.ఏకాంబరం,చౌడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


