భూమిలేని పాసుబుక్ లు ఇచ్చారు – మడవలస గిరిజనుల ఆవేదన

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్,సాలూరు

సాలూరు పట్టణ మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ ఛాంబర్ లో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజీఆర్ఎస్) నిర్వహించగా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యల పరిష్కారం కోసం ఆర్జీలు పెట్టుకున్నారు. అందులో ఒక విచిత్రమైన ధరఖాస్తు (ఆర్జీ) గిరిజన సంఘం నాయకుడు గిరిధర్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లా రు. దానీ సారంశం నియోజకవర్గంలో ఉన్న పాచిపెంట మండలం కేసలి పంచాయితీ మడవలస గిరిజనులకు భూహక్కు పత్రాలు ఇచ్చి భూమి ఎక్కడ ఉందో చూపిం చలేదని ఆయన విలేకరులకు తెలిపారు.అలాగే గత 20 ఏళ్ల క్రితం గ్రామంలో ఉన్న 45 కుటుంబాలకు 90 ఎకరాల భూమికి అధికారులు పాసుబుక్ జారీ చేశారన్నారు. ఆ భూమిపై రైతు భరోసా అలాగే బ్యాంకు లోన్లు గిరిజనులు తీసుకున్నారని అంతేకాకుండా సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు. కాని విచిత్రం ఇప్పటివరకు ఆ 90 ఎకరాల పొలం ఎక్కడ ఉందో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన ఫలితం లేదని విచారణ వ్యక్తం చేశారు. ఆశ చావక మరలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఈ సమస్యను పరిష్కరించాలని కోరమని గిరిజన సంఘం నాయకుడు గిరిధర్ తెలిపారు.మడవలస గిరిజనులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *