
గరుడ న్యూస్ పుంగనూరు పట్టణం బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి శిలావిగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో నిండి మెరిసింది.
