గరుడ న్యూస్ పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రెండో రోజు కొనసాగిన నిరసన కార్యక్రమం.ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో కార్మికులు సంఘం సభ్యులు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలని. కారుణ్య నియామకాలను చేపట్టాలని. ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 29 వేల రూపాయల మంజూరు చేయాలని కోరారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.



