గరుడ న్యూస్,తగరపువలస
తగరపువలస లో జరుగుచున్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 లో ఆదివారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వై. యస్.ఆర్.సీ.పీ. జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం వై.యస్.ఆర్. సీ.పీ. సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర తగరపువలస ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ మ్యాచ్ లో పాల్గొని ఇరు జట్లు మధ్య టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ముందుగా క్రికెట్ మ్యాచ్ ఆడిన క్రీడా కారులకు టీ షర్ట్స్ పంపిణీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుధ్యానికి ఉపయోగపడతాయన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వెలిగితీయాలని అన్నారు. ఇటువంటి క్రికెట్ టీముల నిర్వహణ వలన క్రీడాకారుల లో ఉన్న నిజమైన ప్రతిభ కనిపిస్తుందన్నారు.




