

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: 18.06.2025
ద్రావిడ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం. ఆంధ్ర మాసోక్షవాలలో భాగంగా బుధవారం నాడు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను విశ్వవిద్యాలయ ఉద్యోగులు మరియు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఏం. దొరస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 21. 06.25 వైజాగ్ లో నిర్వహించబడుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నందు మనమందరం భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య వి. కిరణ్ కుమార్, డీన్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య కే. శ్యామల పాల్గొన్నారు.
డాక్టర్ పి.ఎస్ గణేష్ మూర్తి, పి ఆర్ ఓ, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

