ప్రజా సేవకు సై – కార్పొరేట్ వ్యవస్థకు నై…..!

Srinivas Nayak
1 Min Read

ప్రజా సేవకు సై – కార్పొరేట్ వ్యవస్థకు నై…..!
కిసాన్ పరివార్ లిమిటెడ్, సీఈఓ గా డాక్టర్ వివేక్ రాజీనామా . డాక్టర్ వివేక్ మీడియా ముఖంగా వెల్లడి.

మహబూబాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 19, (గరుడ న్యూస్).

మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ వివేక్ ఉద్వేగభరితమైన మాటలు మాట్లాడారు.ప్రజాసేవలో భాగంగా డాక్టర్ వివేక్ చూసే సంస్థ కిసాన్ పరివార్ లిమిటెడ్, సీఈఓ గా రాజీనామా చేస్తున్నట్టు సంచలనంగా వెల్లడించారు.
ఇకపై డి ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ను సంస్థాగతంగా దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో సమరసిల పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధం అయ్యానని, విద్యారంగా,ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.జూన్ 12 న నా పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు 3 గురి కేసు నమోదు చేయడం జరిగింది.నేను తప్పు చేస్తే కేసు పెట్టాల్సిందే – కానీ చట్టం అందరికి సమానమే, కాబట్టి తప్పు చేసే ప్రతిఒక్కరిపై పెట్టాలని, కక్ష్యపూరితంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అనిఅన్నారు.మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ వరద సమయంలో 22 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆపదలో వున్న ప్రజలను ఆదుకున్నందుకు కేసు పెట్టినారా? విద్యార్థులకు,విద్యాసంస్థల్లో ఫ్యాన్ లేక ఇబ్బందులు పడుతుంటే జిల్లా వ్యాప్తంగా వారికి సహాయం చేసినందుకు కేసు పెట్టినారా?.నా బర్త్డే సందర్భంగా డోర్నకల్ మండలం హున్య తండాలో నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చినందుకు కేసు పెట్టినారా?ఇలా చెప్పుకుంటూ పోతే 25 సంవత్సరాల నుండి చేసిన సేవలు ఎన్నెన్నో ఉన్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *