మానుకోట పట్టణంలో నూతన అధ్యాయం సృష్టిస్తున్న సిఐ

Srinivas Nayak
2 Min Read

మానుకోట పట్టణంలో నూతన అధ్యాయం సృష్టిస్తున్న సిఐ
పట్టణంలో అస్తవ్యస్తమైన వ్యవస్థను సరిదిద్దే క్రమంలో సీఐ మహేందర్ రెడ్డి. పట్టణంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి చర్యలు గైకొంటున్న సీఐ.
వర్తక సంఘాలను, రోడ్లపై వ్యాపారాలు చేసే ఇతర వ్యాపారస్తులను పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిచి వారికి కౌన్సిలింగ్ చేస్తున్న సీఐ. పట్టణంలోని బ్యాంకులు ఇతర వాణిజ్య, వ్యాపార వర్గాల షాపుల ముందు అనుమానిత వ్యక్తులే కానీ, రోడ్ సైడ్ వ్యాపారం చేసేవారే కానీ పెట్టనీయకుండా చూసుకోవాలని కౌన్సిలింగ్ ఇస్తున్న సీఐ.
కొత్త బజారులోని పలు ఏరియాలకు కాలినడకన తిరుగుతూ పరిస్థితులను గమనిస్తూ వారి కి సలహాలు, సూచనలు ఇస్తున్న పట్టణ సీఐ. పట్టణ సీఐగా కొత్తగా చార్జి తీసుకున్న సిఐ మహేందర్ రెడ్డి నూతన వరవడిని చూసి సిఐ అంటే ఇలా ఉండాలి అని వారి అభినందనలు తెలియజేస్తున్న వ్యాపార వర్గాలు ప్రజలు.
వ్యాపారస్తుల కు,ప్రైవేట్ సంస్థలకు, బ్యాంకర్లకు, అపార్ట్మెంట్ వాసులకు వారి యొక్క సీసీ కెమెరాలు పనిచేయని ఎడల వెంటనే రిపేర్ చేయించుకుని అమర్చుకోవాలని సిఐ సూచించారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసు అంటూ పట్టణంలో ఎక్కడైనా అనుమానితులు అనిపించిన వెంటనే మా దృష్టికి తీసుకురావాలి సీఐ తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, జూన్ 20, (గరుడ న్యూస్)

ఇటీవల మహబూబాబాద్ పట్టణానికి కొత్తగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య వర్గాల వారిని టౌన్ పోలీస్ స్టేషన్ పిలిపించి వారి సమస్యలు తెలుసుకుంటూ, తమ తమ వ్యాపార దుకాణాల ముందు ఎలాంటి ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి ఉండనివ్వకుండా చూడాలని, పట్టణంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే సంబంధిత పోలీసులకు తెలియజేయాలని, పట్టణంలో అస్తవ్యస్తంగా తయారైన ట్రాఫిక్ ను సరిదిద్దడంలో నడుం బిగించిన సీఐ. పట్టణంలో సీసీ కెమెరాలు ప్రతి దుకాణం ముందు ఏర్పాటు చేసుకోవాలని, వాణిజ్య వ్యాపార వర్గాల వారిని కోరారు. కాలినడకన వ్యాపార వాణిజ వర్గాల వారితో కలిసి నడుస్తూ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. కొత్తగా వచ్చిన సిఐ మహేందర్ రెడ్డి వచ్చి రాగానే వేను వెంటనే కార్యరంగంలోనికి దిగారు. మొట్టమొదటిగా స్థానిక పాత్రికేయులను ఆహ్వానిస్తూ పరిచయ కార్యక్రమాన్ని చేసుకున్నారు. తదుపరి పట్టణంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటూ సంబంధిత వాణిజ్య, వ్యాపార వర్గాల వారిని పిలిపించుకొని వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారి సలహాలను కూడా వింటూ, పట్టణంలోని పరిస్థితులను సరిదిద్దే క్రమంలో నిమగ్నమైన సిఐ మహేందర్రెడ్డి. పట్టణంలోని బ్యాంకుల వద్ద కొన్ని కూడల్ల వద్ద రోడ్డు రోమియోలు, అసాంఘిక వ్యక్తులు గుమి కూడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతామని పాత్రికేయులకు వివరించారు. వచ్చి రాగానే పట్టణంలోని పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ వాటికి సరియైన చర్యలు తీసుకుంటూ ప్రజలలో తనదైనముద్రను వేస్తున్న పట్టణ సీఐ మహేందర్ రెడ్డి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *