గరుడ న్యూస్, పాచిపెంట
చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని 90% రాయితీపై గిరిజనులకు విత్తనాలు అందిస్తున్నామని గిరిజన రైతులు ఈ రాయితీలను సద్వినియోగం చేసుకొని చిరుధాన్యాల విస్తీర్ణాన్ని దిగుబడులను పెంచాలని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు కోరారు. మెలియాకంచేరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ గిరిజన రైతులు పోడు మొక్కజొన్న సాగులో మొక్కజొన్న సాగును చేపట్టవద్దని ఎకరానికి కనీసం 5000 ఆదాయం కూడా రావట్లేదని గిరిజన రైతులే తెలియజేస్తున్నారని ఈ సంవత్సరం చోడి పంట కు కేజీ 49 రూపాయల వరకు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని ఎలాంటి సాగు ఖర్చులు లేని చిరుధాన్యాల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని, తెలిపారు చిరుధాన్యాలను జీవామృతాలను ఉపయోగించి సాగు చేసినట్లయితే దిగుబడులు మరింతగా పెరుగుతాయని, మొక్కజొన్న సాగు ద్వారా రసాయన ఎరువులను పోడు భూమిలో వేయడం వలన పోడు వ్యవసాయం తొందరగా నిస్సారం అవుతుందని కాబట్టి గిరిజన సాంప్రదాయ పంటల ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు అనిల్ కుమార్, రైతులు పాల్గొన్నారు.





