*ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Sesha Ratnam
1 Min Read

భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): సింగం కృష్ణ: సంస్థల నాయకులు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ  56వ,జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన రాహుల్ గాంధీ ఆలోచనలు స్ఫూర్తిదాయకమని భారత జోడోయాత్ర నిర్వహించి భారత దేశ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని పేదలు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుటకు రాహుల్ గాంధీ,గొప్ప సంకల్పము తో నిర్ణయాలు తీసుకోవడం గొప్ప పరిణామమని ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చెప్పారు.రాష్ట్రములో అమలవుతున్న ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు రైతులకు కూలీలకు కార్మికులకు సుబ్బండ వర్గాల సంక్షేమం రాహుల్ గాంధీ ఆలోచన మేరకే జరుగుతున్నాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.ఈ కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *