క్రమం తప్పకుండా యోగ చేయడం వల్ల రక్తపోటు తగ్గడం, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
పుంగనూరు – గరుడ న్యూస్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు గారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ పరిధినందు స్కూల్స్ మరియు సచివాలయలు వివిధ గ్రామాల్లో గ్రామస్తులకు అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలిపి యోగా యొక్క ప్రయోజనాలను వివరించి యోగ ఆసనాలను చేయించడం జరిగింది. యోగా అనేది సున్నితమైన వ్యాయామం, శ్వాస నియంత్రణ మరియు ధ్యానంతో కూడిన పురాతన అభ్యాసం.క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల కలిగే ఆరోగ్య, ప్రయోజనాల్లో రక్తపోటు తగ్గడం, ఆసనాల వల్ల మరియు రక్త ప్రసరణ శరీరంలో బాగా జరుగుతుందని యోగా అనేది వేల సంవత్సరాల నాటి పురాతన భారతీయ తత్వశాస్త్రం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి మార్గంగా రూపొందించింది సున్నితమైన వ్యాయామం చేయడం వల్ల మెదడుకు పడే ఒత్తిడి మరియు నిద్రలేని సమస్యలను పోగొట్టవచ్చు ఇది రోజువారీ ఒత్తిడి నుండి నిశ్శబ్దం మరియు ఉపశమనాన్ని అనుమతిస్తుంది. యోగాను క్రమం తప్పకుండా సాధన చేస్తే, శారీరక, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును సాధించడానికి శక్తివంతమైన గా అధునాతనమైన క్రమశిక్షణగా మారుతుంది. పడి పిల్లలకు పెద్దలకు వృద్ధులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో. నియోజకవర్గ అధికారులు,సిబ్బంది గ్రామాలలోని పాల్గొన్నారు




