
తిరుపతి జిల్లా, పాకాల- గరుడ న్యూస్, జూన్ 20: కార్మికుల హక్కులను హరించటం తగదని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మధుసూదన్ రావు అన్నారు.
పాకాల మండల కేంద్రంలో ఆటో స్టాండ్ కూడలి వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 గంటల పనిని రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.కెవిపిఎస్ మండల అధ్యక్షులు నరేంద్ర మద్దతు ప్రకటించారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆనంద్,మురళి,రాజు,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మయ్య,హాకర్స్ యూనియన్ నాయకులు వెంకటరమణ,పంచాయతీ సంఘం యూనియన్ నాయకులు మురళి,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.



