విద్యార్థినీలకు రక్షణ కల్పించని హాస్టల్ వార్డెన్ అనిత ను సస్పెండ్ చేయాలి
లక్ష కొట్టు డిప్యూటేషన్ ఆర్డర్ పట్టు
ట్రాన్స్ఫర్ అయిన హెడ్మాస్టర్ లకు డిప్యూటేషన్లు ఇవ్వకూడదు
సీనియారిటీ ప్రకారం హెడ్మాస్టర్లను నియమించాలి
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ లక్ష్మీబాయి ను కోరిన
తేజావత్ వాసు నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బోడ రమేష్ నాయక్
లంబాడి హక్కుల పోరాట సమితి
జిల్లా అధ్యక్షుడు మహబూబాబాద్
మహబూబాబాద్ బ్యూరో జూన్ 22 (గరుడ న్యూస్)
మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలు హాస్టల్ వార్డెన్ ల యొక్క అక్రమ సంపాదన మరియు హెడ్ మాస్టర్ లకు వచ్చే పది శాతం కమిషన్ గురించి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ లక్ష్మీబాయిను సెక్రటేరియట్ లో కలిసి మెమోరాండం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలిక ఆశ్రమ పాఠశాల లో గత విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో హాస్టల్ గోడదూకి గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లో ప్రవేశించి తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల అసభ్య కరంగా ప్రవర్తించి అమ్మాయిపై బలత్కారానికి పాల్పడితే మిగతా విద్యార్థినులు భయపడి కేకలు వేయడంతో గుర్తు తెలియని వ్యక్తి పారిపోవడం జరిగింది. ఈ విషయంలో ఏటూరునాగారం పిఓ గారికి అదేవిధంగా భద్రాచలం పిఒ గారి దృష్టికి తీసుకెళ్లిన ఆమెపై చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత ఎండాకాలం సెలవు రోజులలో చివరి రోజు ఒక విద్యార్థిని తన కుటుంబ సభ్యుడు కాకుండా వేరే వ్యక్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్తే ఆ వ్యక్తి ఆ విద్యార్థిని లోబరుచుకొని అఘాయిత్యానికి పాల్పడితే విద్యార్థిని తల్లిదండ్రుల అప్రమత్తత తోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ఇంత దత్తతంగం జరుగుతున్న హాస్టల్ వార్డెన్ అనిత విద్యార్థినుల పట్ల అశ్రద్ధ వహిస్తూ, విద్యార్థినిలకు అందుబాటులో ఉండకుండా, విద్యార్థులపై ఎటువంటి పర్యవేక్షణ చేయకపోవడం వలన ఇలాంటి దారుణాలు వసతి గృహాలలో జరుగుతున్నాయని అన్నారు. ఇంత జరిగిన కూడా హాస్టల్ వార్డెన్ అనిత పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం పక్క హాస్టల్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వార్డెన్ అనిత తనకు షిఫ్టు చేసిన హాస్టల్ కు వెళ్లకుండా ఇదే హాస్టల్లో ఉంటానని పట్టు పడడంలో ఆంతర్యం ఏంటని గిరిజన కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హాస్టల్ వార్డెన్ లు విద్యార్థినిలకు మెనూ ప్రకారం భోజనం అందివ్వకుండా, సాలీ సాలని నీళ్ల చారుతో భోజనం పెట్టి విద్యార్థులను కడుపు కొట్టి , నోరు కొట్టి లక్షలలో అక్రమంగా సంపాదించుకుంటున్నారు. ఈ విధంగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ హాస్టల్ వార్డెన్ లు వేరే చిన్న హాస్టళ్లకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు అని అన్నారు. ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థినిలకు అందుబాటులో లేకుండా, ఎటువంటి పర్యవేక్షణ చేయని, విద్యార్థినిలకు రక్షణ కల్పించని హాస్టల్ వార్డెన్ అనితను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.
హెడ్మాస్టర్ లకు 10 శాతం కమిషన్
హాస్టల్ వార్డెన్లు పేద విద్యార్థుల నోరు కొట్టి లక్షలలో అక్రమంగా సంపాదించిన డబ్బులలో 10% వాటా హెడ్మాస్టర్ లకు వెళ్లాలి. హెడ్మాస్టర్లకు 10 శాతం వాటా ఇవ్వని ఎడల హాస్టల్ వార్డెన్ ల యొక్క బిల్లుల పై ఎలాంటి సంతకాలు పెట్టరు
ఈ విధంగా 10% డబ్బులు కమిషన్ల రూపంలో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ కొంతమంది హెడ్మాస్టర్ లు వారికి ట్రాన్స్ఫర్ అయిన ప్రదేశానికి వెళ్లకుండా లక్ష కొట్టు డిప్యూటేషన్ పట్టు అనే విధంగా పై అధికారులకు డబ్బులు ఆశ చూపి అక్రమ మార్గంలో ఎటువంటి సీనియారిటీ చూడకుండా డిప్యూటేషన్లను పొందుతున్నారు. అందువల్ల ట్రాన్స్ఫర్ అయిన హెడ్మాస్టర్ లను వెంటనే వారికి ట్రాన్స్ఫర్ అయిన ప్రదేశాలకు పంపి సీనియారిటీల ప్రకారం హెడ్మాస్టర్లుగా నియామకాలు చేపట్టాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అజ్మీరా బాలు నాయక్ భూక్య రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.