కూటమి ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు 20లక్షల ఉద్యోగాలు కలించాలి అని నినదిస్తూ భారీ ర్యాలీ


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మేనిఫేస్ట్ లో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 నిరుద్యోగ భృతితో పాటు ఇస్తామన్న 20లక్షల ఉద్యోగాలు ఇవ్వక పొగా, అటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పోయిన కూటమి ప్రభుత్వ నీ నిలదీస్తూ జిల్లా వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలో గల వైయస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా యువత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు జిల్లా రెవిన్యూ అధికారిని హేమలత కి వినతిపత్రం అందచేసి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం తక్షణం అమలు చేశెలా చర్యలు తీసుకోవాలని వైసిపి యువజన విభాగం తరుపున కోరడం జరిగినది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా యూత్ ప్రెసిడెంట్ శరత్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతీ యువకులు, విద్యార్థులు పక్షాన నిలబడి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని నిరుద్యోగ భృతి తో పాటు ఉద్యోగ కల్ప కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినపత్రం సమర్పించడం జరిగిందని తెలియజేశారు. పార్వతిపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జోగారావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాడు మేనిఫెస్టో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఇప్పటికే గత ఏడాది కాలంగా నెలకు 3000 చొప్పున 36,000 నిరుద్యోగ భృతి బాకీ పడ్డారు అని, అలానే 20లక్షల ఉద్యోగాలు కల్పించాలని, తీసిన ఉద్యోగాలు ఇప్పించాలని వైసిపి తరుపున రాష్ట్ర వ్యాప్తంగా నేడు యువత పోరు కార్యక్రమం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది అని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు నగిరెడ్డి శరత్ బాబు, కురుపాం నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ పల్లా అనంత నాయుడు, పార్వతీపురం నియోజకవర్గం యూత్ వింగ్ ప్రెసిడెంట్ కోరాడ శేఖర్, పార్వతీపురం టౌన్ యూత్ ప్రెసిడెంట్ BS సంతోష్ కుమార్, పార్వతీపురం రూరల్ యూత్ ప్రెసిడెంట్ ఉరిటి అప్పలనాయుడు, సీతానగరం యూత్ ప్రెసిడెంట్ దాసరి కిషోర్, బలిజిపేట యూత్ ప్రెసిడెంట్ రణదేవ్ లక్ష్మణరావు, పార్వతీపురం నియోజకవర్గం స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ ముగడ జగన్ మోహన్ రావు, కురుపాం నియోజకవర్గం స్టేట్ యూత్ సెక్రటరీ నిమ్మక గోపాల్, కురుపాం నియోజకవర్గం స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ షైక్ నిషార్, సాలూరు నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ పొటంగి అచ్యుతరావు, పాలకొండ నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ పొట్నూరు లక్ష్మణ రావు లతో పాటు నిరుద్యోగ యువతీ యువకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



