– కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ చేపట్టిన వైయస్ఆర్ యువజన ,విద్యార్థి విభాగం
– ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు విడుదల చేయాలని జాయింట్ కలెక్టర్ గారికి వినతి
– ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించిన వైయస్ఆర్ యువజన , విద్యార్థి విభాగం
– కార్యక్రమంలో పాల్గొన్న అన్ని నియోజకవర్గ యువత,విద్యార్థి నాయకులు, వేలాది మంది యువత
గరుడ న్యూస్ పుంగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి , YS జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు, నిరుద్యోగులకు జరిగిన యువత పోరులో భాగంగా.ఈ రోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాయలసీమ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చంగా రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్, చిత్తూరు జిల్లా స్పీక్స్ పర్సన్ రాజశేఖర్ రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి , యువజన విభాగం నాయకులు బావాజీ, నాగేంద్ర, మల్లికార్జున, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు




