లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల సేవ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Ashok kumar
1 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జూన్24,(గరుడ న్యూస్):

లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ 10 వ,నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం రోజున చౌటుప్పల మున్సిపాలిటీ లోని వలిగొండ రోడ్డులో గల లయన్స్ భవన్ నందు నూతన ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రమాణ  స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ మల్టిపుల్ చైర్పర్సన్ తీగల మోహన్ రావు,విచ్చేసి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలోనే 210 దేశాలలో ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం 100 ల,వందల కోట్ల రూపాయలను సేకరించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అని అన్నారు.రెండవ వైస్ డిస్టిక్ గవర్నర్ కోడె సతీష్ కుమార్,క్లబ్బు లో నూతనంగా చేరినటువంటి సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు.మొదటి వాయిస్ డిస్టిక్ గవర్నర్ కె.వి ప్రసాద్,ఈ సంవత్సర క్లబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల సేవ ఏర్పడి 10 పది సంవత్సరాలుగా చౌటుప్పల మండలంలో లక్షల రూపాయలతోటి అనేక సేవా కార్యక్రమాలు  నిర్వహించారని అన్నారు.అదేవిధంగా క్లబ్ సభ్యుల సహకారంతోటి ఉచిత కంటి ఆసుపత్రిని నిర్మించుకొని వందల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా నాయకులు చెరుపల్లి నరసింహ్మ,సత్యనారాయణ,రవీందర్రావు,నూతన అధ్యక్షులుగా తీరం దాస్ జగన్నాథ్,కార్యదర్శి పాషా,కోశాధికారి సిలివేరు మంగయ్య,నూతన కమిటీ దాచేపల్లి ప్రకాష్ గుప్తా,మొగుదాల రమేష్ గౌడ్,గోశిక కరుణాకర్,నాంపల్లి రమేష్,పోలోజు శ్రీనివాస చారి,ఉప్పు ఆంజనేయులు,కాసుల వెంకటేశం,కటకం ప్రశాంత్,కొసనం రాంరెడ్డి,శ్రీనివాస ప్రసాద్,చింతల తిరుమలరెడ్డి, భాస్కర్ రెడ్డి,వేముల నరసింహ,కామిశెట్టి భాస్కర్,గోవర్ధన్ రెడ్డి, బత్తిని రఘు,తదితరులు,పాల్గొనడం జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *