
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 26
చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామంలో ఉన్న స్వయంభు వైష్ణవి దేవి మాత ఆలయంలో గురువారం వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకురాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకము అలంకరణ గావించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ నిర్మాణకర్త వినోద్ కుమార్ రెడ్డి పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు వారాహి నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు పలు కార్యక్రమాలు జరుగుతాయని భక్తుల పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు
