సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, జూన్26,(గరుడ న్యూస్):
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,తనను కలవడానికి వచ్చే వాళ్ళు,తనకు శాలువాలు కప్పాలనుకునే వాళ్ళు సిల్క్,శాలువాలు తీసుకురాకుండా చేనేత శాలువాలతో రావాలని మునుగోడు నియోజకవర్గ నాయకులకు,ప్రజలకు పిలుపునిచ్చారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.మునుగోడు నియోజకవర్గం లో నేతన్నలు తయారచేసే చేనేత శాలువాలను మాత్రమే తీసుకురావాలని అన్నారు.మునుగోడు నియోజకవర్గం లో ఎంతోమంది నేతన్నలు నేత పని పై ఆధారపడి జీవిస్తున్నారని,నేతన్నలు నేసే శాలువాలు తీసుకోవడం వల్ల వారికి ఉపాధి కల్పించిన వాళ్లమవుతామని అన్నారు.ఇకముందు నుండి తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మునుగోడు నియోజకవర్గ చేనేత కుటుంబాలు నేసే శాలువాలు మాత్రమే తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే చేనేత వస్త్రాలను ఆదరించాలని,పిలుపునివ్వడంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ,కృతజ్ఞతలు తెలియజేశారు.