

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండల గరుడ న్యూస్ (ప్రతినిధి): 65 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు ముందుగానే కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 18,20 వార్డులో ఇంటి వద్ద జూలై నెల కోట రేషన్ సరుకులు అందించిన 5 నంబర్ రేషన్ షాప్ డీలర్ పద్మనాభం. 65 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు ప్రతి నెల 26 నుంచి 30 లోపే ఇంటింటికి ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సాధారణ కార్డుదారులకు రేషన్ దుకాణాల వద్ద 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

