


వినతుల పరిష్కారానికి హామీ ఇచ్చిన విజయ్ చంద్ర
ప్రజాదర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర
పార్వతీపురం, గరుడ న్యూస్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే నా ఎజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. మరి కొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడమే ద్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజలు విన్నవించిన ప్రతి సమస్యను తక్షణ పురస్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే పింఛన్లు, ఇల్లు, రోడ్లు, భూసమస్యలు, తదితర పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
