
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 27
మండలంలోని పంచాయతీ కేంద్రం పుధిపట్లలో గల వైష్ణవి దేవి ఆలయంలో జరుగుతున్న వారాహిమాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజున శుక్రవారం అమ్మవారి ఆలయంలో సౌందర్యలహరి పారాయణం వీనుల విందుల జరిగింది మహిళ భక్తురాళ్ళు ఆలయం ముందు కూర్చుని సౌందర్యలహరి పారాయణం చేశారు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకరాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకము ప్రత్యేక అలంకరణ నిర్వహించారు శివ విష్ణు బ్రహ్మ స్వరూపమైన అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు పలు ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులతో దేవస్థానం కిటకిటలాడింది ఆలయ నిర్మాణ కర్త వినోద్ కుమార్ రెడ్డి భక్తులకు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు వారాహి దేవి నవరాత్రులలో అమ్మవారిని దర్శించి తరించాలని నిర్వాహకులు కోరారు
