
పార్వతీపురం, గరుడ న్యూస్ : తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరు అని కోటి రూపాయలు ఇచ్చినా ప్రలోభాలకు లొంగి పోరని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు పార్వతీపురం నియోజకవర్గంకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జీలు, గ్రామ కమిటీలు పార్టీ సీనియర్ నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ బిజెపికి ఆర్ఎస్ఎస్, హైదరాబాదులో మజ్లీస్ పార్టీలు మాదిరిగా కోట్లాది రూపాయలతో ప్రతిపక్షాలు ఎన్నో ప్రలోభాలు పెట్టినా టిడిపి నాయకులు,కార్యకర్తలు ఆశ పడరాదని ఉద్బోధించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు పదవి లభిస్తుందని అలాగే ఉజ్వల భవిష్యత్తు కూడా అందుతుందని పేర్కొన్నారు టిడిపిలో ప్రతి ఒక్కరూ కార్యకర్తేనని, అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని అనేక సందర్భాలలో స్పష్టం చేశారని వెల్లడించారు. ఇతర పార్టీలు మాదిరిగా టిడిపిలో నియంతృత్వం అహంకార ధోరణి కనిపించదని తెలియజేశారు. త్వరలో నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి గత ఏడాదికాలంగా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సి ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు. పార్టీ పరిశీలకుడిగా వచ్చిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పట్ల ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంటుందని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈకార్యక్రమంలో కురుపాం, పాలకొండ, సాలూరు పార్టీ పరిశీలకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



